Jagan: జగన్ దగ్గరకు వచ్చిన తెలుగుదేశం కార్యకర్త... గోడు చెప్పుకుని సభ్యత్వ కార్డును చింపేసిన వైనం!

  • ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్ర
  • కష్టాలు చెప్పుకున్న టీడీపీ కార్యకర్త మురళీకృష్ణ
  • తన సభ్యత్వ కార్డును చింపేసి నిరసన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో జరుగుతుండగా, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మురళీకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జగన్ ను కలసి తన కష్టాలను చెప్పుకుంటూ, టీడీపీని నమ్మి మోసపోయానని చెబుతూ, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డును చింపేసి నడిరోడ్డుపై విసిరేసి తన నిరసన తెలిపాడు.

తనది విజయవాడని, భీమవరంలో బంధువుల జ్యూస్ షాపులో కూలీగా పని చేశానని, తెలుగుదేశం పార్టీ నేతల కోసం జెండాలు కట్టానని చెప్పిన మురళీకృష్ణ, తనకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమంటే, డబ్బులు అడుగుతున్నారని వాపోయాడు. విజయవాడ కార్పొరేషన్ లో ఉద్యోగం కోసం మూడు లక్షలు డిమాండ్ చేస్తున్నారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం లంచం ఇవ్వలేక, కూలీగానే బతుకుతున్నానని చెప్పుకున్నాడు. మురళీకృష్ణ సమస్య విని స్పందించిన జగన్, రాబోయేది ప్రజా ప్రభుత్వమని, ఇటువంటి తమ్ముళ్లందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ముందుకు కదిలారు.

Jagan
Padayatra
Telugudesam Activist
West Godavari District
  • Loading...

More Telugu News