BJP: బాప్‌రే! బీజేపీకి వందల కోట్ల విరాళాలు!
- బీజేపీకి వెల్లువెత్తిన విరాళాలు
- ఏడు జాతీయ పార్టీలకు రూ.710.80 కోట్ల విరాళాలు
- బీజేపీకి రూ.515.43 కోట్లు
భారతీయ జనతాపార్టీకి విరాళాలు వెల్లువెత్తాయి. వివిధ రంగాల నుంచి వంద కోట్లు విరాళాల రూపంలో వచ్చి పడ్డాయి. ముఖ్యంగా కార్పొరేట్, వ్యాపార రంగాలు, గుర్తు తెలియని వర్గాల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు అందాయి. ఇలా విరాళాలు అందుకోవడంలో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ఈ విషయాన్ని వెల్లడించింది.
2016-17 సంవత్సరంలో వివిద వర్గాల నుంచి ఏడు జాతీయ పార్టీలకు మొత్తం రూ.710.80 కోట్ల విరాళం రాగా, అందులో బీజేపీకే రూ.515.43 కోట్లు రావడం విశేషం. మొత్తం విరాళాల్లో రూ.589.38 కోట్లు రూ.20 వేల కన్నా ఎక్కువ మొత్తాల్లో విరాళాల రూపంలో అందగా, ఇందులో ఒక్క బీజేపీకే 1,194 మంది నుంచి రూ. 532.27 కోట్లు వచ్చాయి.
రూ.20 వేల కన్నా ఎక్కువ మొత్తాలతో కాంగ్రెస్ రూ.41.90 కోట్లు విరాళంగా పొందింది. రూ.20 వేలకు మించిన మొత్తాలతో బీఎస్పీకి ఒక్క విరాళం కూడా రాలేదు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బీజేపీకి రూ.464.94 కోట్లు రాగా, కాంగ్రెస్‌కు రూ.126.12 కోట్లు వచ్చాయి.
2015-16లో బీజేపీకి రూ.76.85 కోట్లు విరాళంగా రాగా.. ఈసారి అది వంద కోట్లకు చేరడం గమనార్హం. కార్పొరెట్, వ్యాపార రంగాల నుంచి ఆ పార్టీకి రూ.515.43 కోట్ల విరాళాలు అందాయి. కాంగ్రెస్‌కు రూ.36.06 కోట్లు అందగా, సత్య ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి బీజేపీకి రూ.251.22 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 13.90 కోట్లు అందాయి.