Nimmakayala Chinarajappa: పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారు: చినరాజప్ప

  • ఉద్ధానంలో కిడ్నీ బాధితులను ఆదుకుంటున్నాం
  • అన్ని చర్యలు తీసుకుంటున్నాం
  • ఆర్వో ప్లాంట్లు, మూడు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు 
  • నెలకు రూ.2500 పెన్షన్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థుల సమస్యలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పవన్‌ విమర్శల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. కాకినాడలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జనసేనాని ఆరోపణలపై స్పందించిన చినరాజప్ప... ఉద్ధానంలో కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి తమ సర్కారు అన్ని చర్యలు తీసుకుందని అన్నారు. కిడ్నీ బాధితుల కోసం ఇప్పటికే ఆర్వో ప్లాంట్లు, మూడు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అంతేగాక కిడ్నీ వ్యాధిగ్రస్థులకు నెలకు రూ.2500 పెన్షన్ కూడా ఇస్తున్నామని అన్నారు.

Nimmakayala Chinarajappa
  • Loading...

More Telugu News