Mahesh Babu: కోటీశ్వరుడిగా మహేశ్ బాబు .. పేదవాడైన స్నేహితుడిగా అల్లరి నరేశ్

- వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు
- నిర్మాతలుగా దిల్ రాజు .. అశ్వనీ దత్
- తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో
మహేశ్ బాబు 25వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును వచ్చేనెల 8వ తేదీనగానీ .. 10వ తేదీనగాని మొదలుపెట్టనున్నారు. తొలి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.
