hrithik roshan: హృతిక్ రోషన్ జోడీగా ఛాన్స్ పట్టేసిన దిశా పఠాని!

  • తెలుగులో 'లోఫర్' చేసిన దిశా పఠాని
  • హిందీలో 'భాగీ 2'తో దక్కిన సక్సెస్
  • స్టార్ హీరోల సరసన ఛాన్సులు

'లోఫర్' సినిమాతో తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన దిశా పఠానికి పరాజయమే ఎదురైంది. అందువలన ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. దాంతో ఆమె కూడా తెలుగు .. తమిళ భాషల్లో అవకాశాల కోసం ఎదురుచూడకుండా హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. హిందీలో స్టార్ హీరోలతో చేయాలనే పట్టుదలతో గట్టిప్రయత్నాలే చేయడం మొదలుపెట్టింది.

ఈ ప్రయత్నంలో భాగంగానే ఆమెకి 'భాగీ 2' సినిమాతో హిట్ దక్కింది. ఈ సినిమా సక్సెస్ తో పలువురు దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన దిశాకి సల్మాన్ ఖాన్ మూవీలో ఒక హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇక హృతిక్ రోషన్ సినిమాలోను ఛాన్స్ పట్టేసిందనేది తాజా సమాచారం. సాజిద్ నడియడ్ వాలా నిర్మించనున్న ఈ సినిమాకి రోహిత్ ధావన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలతో అమ్మడు బాలీవుడ్ లో పాతుకుపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

hrithik roshan
disha patani
  • Loading...

More Telugu News