Rahul Gandhi: డియర్‌ మోదీ... ఒక్క పైసా తగ్గించడం ఏంటీ?: రాహుల్‌ గాంధీ

  • చిన్నపిల్లల చర్యలా ఉంది
  • పరిణతి లేని ఆలోచన
  • నా సవాలుకి ఇదేనా ప్రతి స్పందన?

పెట్రోల్‌, డీజిల్ ధరలు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయంటూ దేశ వ్యాప్తంగా వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ.. మరోవైపు వాటి ధరను ఈ రోజు ఒక్క పైసా చొప్పున తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్క పైసా తగ్గించడం ఏమిటంటూ మరిన్ని విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ విషయంపై స్పందిస్తూ.. 'డియర్‌ మోదీ' అంటూ ఓ ట్వీట్ చేసి ప్రధానిపై విమర్శలు గుప్పించారు. 'ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఒక్క పైసా తగ్గించారు. ఇది మోదీ ఐడియానే అయితే, అది చిన్న పిల్లల ఆలోచనలా, ఏ మాత్రం పరిణతి లేని చర్యలా ఉంది' అని రాహుల్‌ పేర్కొన్నారు.

అలాగే, ఇటీవల టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను మోదీ స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాహుల్‌ గాంధీ పెట్రోల్‌ ధరలు తగ్గించాలంటూ ఛాలెంజ్‌ విసిరారు. ఆ విషయాన్ని తాజాగా గుర్తు చేస్తూ.. 'గత వారం నేను విసిరిన ఛాలెంజ్‌పై స్పందిస్తూ ఇలా ధర ఒక్క పైసా తగ్గించడం సరైంది కాదు' అని పేర్కొన్నారు.                      

  • Loading...

More Telugu News