sanju: బాలీవుడ్‌ సినిమా ‘సంజు’ ట్రైలర్‌ విడుదల

  • అచ్చం సంజయ్‌ దత్‌లా రణ్‌బీర్‌ కపూర్‌
  • అలరిస్తోన్న డైలాగులు 
  • వచ్చేనెల 29న విడుదల

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధానపాత్రలో సినీ నటుడు సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న బయోపిక్‌ ‘సంజు’ సినిమా ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. 'బయోపిక్‌ తీసేంత వెరైటీ లైఫ్ ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఎందుకంటే, నేనొక పోకిరిని, డ్రగ్స్‌కి అలవాటు పడినవాడిని.. కానీ ఉగ్రవాదిని మాత్రం కాదు' అంటూ హీరో సరదాగా డైలాగ్ చెప్పాడు.

ఇలా ఈ ట్రైలర్‌లోని డైలాగులు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. సినిమాలోని కొన్ని కామెడీ సీన్లను కూడా ఇందులో చూపించారు. వచ్చేనెల 29న విడుదల కానున్న 'సంజు'కి రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించారు. సంజు తండ్రి పాత్రలో పరేశ్‌ రావల్‌ నటించగా, ఆయన రెండో భార్య మాన్యత పాత్రలో దియా మీర్జా నటించారు. కొన్ని రోజుల ముందు విడుదలైన 'సంజు' టీజర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రణబీర్‌ కపూర్‌ అచ్చం సంజయ్‌ దత్‌లా నటించాడు.                                                                                               

sanju
Bollywood
trailer
  • Error fetching data: Network response was not ok

More Telugu News