diwakar reddy: జేసీ దివాకర్ రెడ్డిని జనాలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి: ఆకేపాటి అమరనాథ్ రెడ్డి

  • మహానాడులో వైయస్ఆర్ కుటుంబాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు
  • జోకర్ లాంటి జేసీతో చంద్రబాబు మాట్లాడిస్తున్నారు
  • జేసీ ప్రవర్తన ఇలాగే ఉంటే.. ప్రజలు క్షమించరు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని జనాలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని వైసీపీ నేత ఆకేపాటి అమరనాథరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహానాడులో దివంగత రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని, జోకర్ లాంటి దివాకర్ రెడ్డితో చంద్రబాబు మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ... ఇప్పుడు ఆయన కుటుంబాన్నే విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివాకర్ రెడ్డి ప్రవర్తన ఇలాగే కొనసాగితే ప్రజలు సహించరని, జాగ్రత్తగా ఉంటే ఆయనకు మంచిదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో దివాకర్ రెడ్డి ఓటమి తప్పదని అన్నారు. టీడీపీ, బీజేపీలు కలసి ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. 

diwakar reddy
jc
Chandrababu
ys rajasekhar reddy
mahanacu
amaranatha reddy
rachamalli siva prasad reddy
  • Loading...

More Telugu News