Fara Khan: ఫరా ఖాన్ ను పరామర్శించేందుకు వచ్చి నాగినీ డ్యాన్స్ చేసిన నటి... వీడియో చూడండి!

  • విరిగిన కాలి ఎముక
  • విశ్రాంతి తీసుకుంటున్న ఫరా ఖాన్
  • పరామర్శిస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

బాలీవుడ్ డాన్స్ డైరెక్టర్ గా, మహిళా దర్శకురాలిగా రాణించిన ఫరాసనా ఖాన్ కాలి ఎముక విరగగా, పరామర్శించేందుకు వచ్చిన టీవీ నటి కరిష్మా తన్నా, వీల్ చైర్ లో కూర్చుని నాగినీ నృత్యం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను పరామర్శించేందుకు పలువురు సెలబ్రిటీలు క్యూ కట్టారు. సీమా ఖాన్, మలైకా అరోరా, అమృతా అరోరా తదితరులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన వారిలో ఉన్నారు. ఇక ఫరా ఖాన్ ఇంటికి వెళ్లిన కరిష్మా తన్నా మరో అడుగు ముందుకేసి వినూత్నంగా డాన్స్ చేసి ఆమెలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

కాగా, ఈ నెల ప్రారంభంలో ఓ టీవీ షోలో ఫరాఖాన్ గాయపడింది. గత సంవత్సరం అక్టోబరులోనూ ఆమె కాలు విరగగా, ఇప్పుడు మరోసారి అదే కాలుకు గాయం కావడంతో నృత్యాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యలు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.

Fara Khan
Karishma Tanna
Nagin Dance
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News