Jagan: కొనసాగుతున్న జగన్ పాదయాత్ర.. నైట్ క్యాంపు వద్ద ప్రజల నుంచి సలహాల స్వీకరణ!

  • వడదెబ్బను లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్న జగన్
  • 176వ రోజుకు చేరుకున్న ప్రజాసంకల్ప యాత్ర
  • కొప్పర్రు నుంచి స్టీమర్ రోడ్డు వరకు కొనసాగనున్న నేటి యాత్ర

గత ఆరు నెలలుగా ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్ నిన్న వడదెబ్బకు గురైన సంగతి తెలిసిందే. జలుబు, జ్వరం, తలనొప్పితో ఆయన బాధపడుతున్నారు. అయినప్పటికీ లెక్కచేయకుండా తన పాదయాత్రను ఆయన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం పశ్చిమగోదావరి జిల్లా కొప్పర్రు శివారులోని నైట్ క్యాంప్ నుంచి జగన్ తన 176వ రోజు పాదయాత్రను ప్రారంభించారు.

కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగనుంది. భోజన విరామం అనంతరం చిన మామిడిపల్లి, నరసాపురం, స్టీమర్ రోడ్డు వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. జగన్ కు సలహాలు, సూచనలు ఇవ్వాలనుకునే వారు నైట్ క్యాంపుకు వెళ్లి, ఆయనను కలుసుకుని తమ లేఖలను అందజేయవచ్చు. 

Jagan
padayatra
suggestions
night camp
  • Loading...

More Telugu News