Rajinikanth: కర్ణాటకలో రజనీకాంత్ 'కాలా' విడుదలపై నిషేధం!

  • 'కాలా' చిత్రంపై నిషేధం విధించిన కర్ణాటక ఫిలిం ఛాంబర్
  • కావేరీ జలాలపై రజనీ వ్యాఖ్యలే కారణం
  • సినిమాను బ్యాన్ చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చిన కన్నడ సంఘాలు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ షాక్ ఇచ్చింది. ఆయన తాజా చిత్రం 'కాలా'ను కర్ణాటకలో విడుదల చేయరాదని కర్ణాటక ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి కర్ణాటకకు వ్యతిరేకంగా రజనీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, వివిధ కన్నడ సంఘాలు ఆయన చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ఫిలిం ఛాంబర్ పై ఒత్తిడిని తీసుకొచ్చాయి.

 ఈ నేపథ్యంలో, 'కాలా' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకుండా నిషేధం విధించినట్టు కర్ణాటక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు గోవింద్ తెలిపారు. ఈ మేరకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి, నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మరోవైపు, జూన్ 7వ తేదీన 'కాలా' చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. 

Rajinikanth
kaala
karnataka
ban
  • Loading...

More Telugu News