Jagan: వైఎస్ జగన్ కు అస్వస్థత... ఎండ వేడిమికి వడదెబ్బ!

  • ఆరు నెలలుగా పాదయాత్ర
  • ఎండాకాలంలోనూ కొనసాగిన యాత్ర
  • జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు
  • వెల్లడించిన వైకాపా ప్రధాన కార్యదర్శి  

సుమారు ఆరు నెలలుగా ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నందున వడదెబ్బ తగిలిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు. ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారని, అయినప్పటికీ, తన యాత్రను కొనసాగించారని తెలిపారు. నిన్న రాత్రి పాదయాత్ర ముగిసిన తరువాత జగన్ ను పరీక్షించిన వైద్యులు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.

Jagan
Padayatra
Fever
Cold
  • Loading...

More Telugu News