Bank Strike: దేశవ్యాప్తంగా బ్యాంకులే కాదు, ఏటీఎంలూ పనిచేయవు: ఉద్యోగ సంఘాల ప్రకటన

  • మెరుగైన వేతనాలు డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు
  • నేడు, రేపు 10 లక్షల మంది సమ్మెలోకి
  • పని చేయనున్న ప్రైవేటు బ్యాంకులు

తమకు మరింత మెరుగైన వేతనాలు కావాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికిపైగా బ్యాంకు ఉద్యోగులు మొదలుపెట్టిన రెండు రోజుల సమ్మె ఈ ఉదయం ప్రారంభమైంది. వేతన సవరణపై చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడంతోనే సమ్మెకు దిగక తప్పలేదని, మొత్తం 9 బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీవోసీ) తెలియజేసింది. ఈ రెండు రోజుల పాటు ఏటీఎంలు కూడా పని చేయవని, ప్రజలు తమ న్యాయమైన డిమాండ్లను సహృదయంతో అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నామని యూఎఫ్బీయూ పేర్కొంది.

బ్యాంకుల్లో నిర్వహణా లాభాలు పెరుగుతూ, సిబ్బంది వ్యయాలు తగ్గినప్పటికీ, వేతనాల పెంపును పరిగణనలోకి తీసుకోలేదని నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అశ్విని రాణా తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కాగా, చెక్కుల క్లియరెన్స్ మినహా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు మామూలుగానే పనిచేయనుండగా, భారత బ్యాంకింగ్ రంగంలో 75 శాతం వాటా ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి.

  • Loading...

More Telugu News