Tamil Nadu: ప్రముఖ తమిళ నిర్మాత ముక్తా శ్రీనివాసన్‌ ఇకలేరు!

  • తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 67 చిత్రాల నిర్మాణం
  • బాలచందర్, మణిరత్నంలకు గురువుగా చిరపరిచితులు
  • ‘నాయకన్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి

బాలచందర్, మణిరత్నం వంటి పలువురు దర్శకులకు గురువుగా చిరపరిచితులైన ప్రముఖ తమిళ నిర్మాత ముక్తా శ్రీనివాసన్ (90) మంగళవారం రాత్రి మృతి చెందారు. ముక్తా ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 67కు పైగా చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన ‘నాయకన్’ చిత్రం భారత్ నుంచి తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయి చరిత్ర సృష్టించింది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాత్రి పది గంటల సమయంలో స్వగృహంలోనే కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నటులు రజనీకాంత్, కమలహాసన్, దర్శకుడు మణిరత్నం తదితరులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. 

Tamil Nadu
Producer
mukta srinivasan
Tollywood
  • Loading...

More Telugu News