NDA: కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ సాగవని ఎన్డీఏ నాయకులను హెచ్చరిస్తున్నాను: చంద్రబాబు

  • కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ సాగవు
  • సమర్థవంతంగా తిప్పికొట్టే మా తమ్ముళ్లున్నారు
  • నేను 5 కోట్ల ఏపీ ప్రజలకు మాత్రమే భయపడతా
  • ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

'న్యాయం చేయమని అడిగితే వేరే వారితో కలిసి మాపై కుట్రలు చేస్తారా?' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ సాగవని ఎన్డీఏని హెచ్చరిస్తున్నానని అన్నారు. విజయవాడలో జరుగుతోన్న మహానాడులో ముగింపు ప్రసంగం చేసిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

"బీజేపీ చేస్తోన్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టే మా తమ్ముళ్లున్నారు, చెల్లెళ్లున్నారు. తెలుగు దేశం పార్టీ కుటుంబం ఉంది. నేను ఎవరికీ భయపడే అవసరం లేదు. నేను 5 కోట్ల ఏపీ ప్రజలకు మాత్రమే భయపడతా.. వారి కోసమే ఆలోచిస్తా. ప్రతిరోజు కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు. రాజధానిపై విమర్శలు చేస్తున్నారు. నీతివంతమైన పాలన అందిస్తున్నందుకే విమర్శలు చేస్తున్నారా? అని నేను అడుగుతున్నాను. టీడీపీ ముందు మీ ఆటలు సాగవు" అని చంద్రబాబు హెచ్చరించారు.

కాగా, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు మహానాడు కృతజ్ఞతలు చెబుతోందని చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను కేంద్ర సర్కారు అమలు చేయాలని అన్నారు.  తాము 2800 ఎంవోయూలు చేసుకున్నామని, అవన్నీ అమలైతే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు.  

  • Loading...

More Telugu News