Lok Sabha: 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కీలకంగా మారిన ‘కైరానా’ ఉప ఎన్నిక

  • యూపీలోని కైరానాలో నిన్న ఉప ఎన్నిక
  • బీజేపీపై పోటీకి ఒక్కటై తమ అభ్యర్థిని నిలబెట్టిన ప్రతిపక్షాలు
  • యూపీలో అత్యధిక లోక్ సభ స్థానాలు 

మహారాష్ట్రలోని పాల్ఘర్, భనారా-గోండియా, నాగాలాండ్ తో పాటు యూపీలోని కైరానా లోక్‌సభ స్థానాలకు నిన్న ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ యూపీలోని కైరానా లోక్‌సభ నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలసికట్టుగా కైరానా సీటుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి.

దేశం మొత్తం మీద యూపీలోనే ఎక్కువ లోక్ సభ సీట్లున్నాయి. ఏకంగా 80 లోక్ సభ స్థానాలున్న ఆ రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ తన హవాతో అత్యధిక స్థానాలను (71 సీట్లు) కైవసం చేసుకుంది. బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్‌కు రెండు సీట్లు దక్కాయి. 2019లో వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీకి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒకే అభ్యర్థిని పోటీ పెట్టాయి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించవచ్చని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.  
 
 గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా లేకపోవడంతో ఓట్లు చీలి బీజేపీకి లాభాన్ని చేకూరింది. దీంతో ఈ సారి ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి బీజేపీకి వ్యతిరేకంగా ఏకమై పోటీ చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ యోగి రాజీనామా చేసిన గోరఖ్‌పూర్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఖాళీ చేసిన ఫూల్పూర్‌ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో ప్రతి పక్షాల ఐక్యత కారణంగా, బీజేపీకి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News