varma: సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఆఫీసర్'

  • వర్మ దర్శకత్వంలో 'ఆఫీసర్'
  • పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున 
  • జూన్ 1వ తేదీన భారీ రిలీజ్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా చేసిన 'ఆఫీసర్' .. కొంతసేపటి క్రితమే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా విడుదలకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. జూన్ 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చాలా కాలం తరువాత వర్మ .. నాగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వలన, 'శివ'ను మించినదిగా ఈ సినిమా ఉంటుందని వర్మ చెప్పడం వలన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి వుంది. కర్ణాటకకి చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగిందని చెప్పడం వలన అందరిలో ఆత్రుత పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, తప్పకుండా ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందని భావిస్తున్నారు.     

  • Loading...

More Telugu News