Saina Nehwal: సైనా నెహ్వాల్ కు నాన్ వెజ్ ఎలా అలవాటు చేశానంటే...: పుల్లెల గోపీచంద్ వెల్లడించిన ఆసక్తికరాంశం!

  • చైనా పర్యటనలో టేబుల్ పై మాంసాహారం మాత్రమే
  • ఏదో ఒకటి తినాలని బలవంత పెట్టా
  • ఆపై సైనా మెల్లిగా అలవాటు చేసుకుందన్న పుల్లెల

పూర్తి శాకాహారాన్ని మాత్రమే తినే షట్లర్ సైనా నెహ్వాల్ కు తాను నాన్ వెజ్ అలవాటు చేయాల్సి వచ్చిందంటూ చెప్పిన కోచ్ పుల్లెల గోపీచంద్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఒకసారి తాము చైనాకు వెళ్లాల్సి వచ్చిందని, అక్కడ మాంసాహారం తప్ప మరేమీ లేదని గుర్తు చేసుకున్న ఆయన, ఏదో ఒకటి తినాలని బలవంతం పెట్టానని, అప్పుడు 'డక్స్ టంగ్' స్నాక్ ను మాత్రమే తీసుకున్న సైనా, అప్పటి నుంచి మాంసాహారాన్ని అలవాటు చేసుకుందని చెప్పాడు.

ఆమెలో ఎల్లప్పుడూ మ్యాచ్ లు గెలవాలన్న సంకల్పం ఉంటుందని, ప్రత్యర్థి ఎవరైనా, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా పోరాడుతుందని, పోటీకి ముందు 'నేను ఓడిస్తా' అని, గెలిచాక 'గెలిచాను సోదరా' అని చెప్పడమే ఆమెకు తెలుసని చెప్పుకొచ్చారు. పట్టుదల, ఏకాగ్రత సైనా సొంతమని అన్నారు. తన శిష్యురాళ్లను చూసిన తరువాతే 'అమ్మాయిలు అనుకుంటే ఏదైనా సాధిస్తార'న్న నమ్మకం కలిగిందని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News