banks employees strike: రేపు, ఎల్లుండి బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
- 2 శాతమే వేతన పెంపును ప్రతిపాదించిన బ్యాంక్స్ అసోసియేషన్
- ఇది చాలదంటున్న ఉద్యోగులు
- ప్రభుత్వ కార్యక్రమాలతో తమపై పనిభారం పెరిగిందని ఆవేదన
- మరింత వేతన పెంపును ఆశిస్తున్న ఉద్యోగులు
మరోసారి బ్యాంకు ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 30, 31వ తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు పలు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ నెల 5న జరిగిన సమావేశంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేవలం 2 శాతమే వేతనం పెంచుతామని ప్రతిపాదించడంతో నిరసనగా సమ్మెకు దిగుతున్నాయి. మరింత వేతన పెంపును ఆశిస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయనున్నాయి.
ఎన్ పీఏలకు చేస్తున్న కేటాయింపుల వల్లే బ్యాంకులు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని, ఈ నష్టాలకు బ్యాంకు ఉద్యోగులు బాధ్యులు కారని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కన్వీనర్ దేవిదాస్ తుల్జపుర్కార్ తెలిపారు. గత రెండు మూడేళ్లుగా బ్యాంకుల ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాలైన జన్ ధన్ యోజన, డీమోనిటైజేషన్, ముద్ర, అటల్ పెన్షన్ యోజన అమలు కోసం ఎంతో శ్రమించి పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమాల కారణంగా ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. గత వేతన పెంపు కాలం 2012 నవంబర్ 1 నుంచి 2017 అక్టోబర్ 31 వరకు 15 శాతం వేతన పెంపును ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.