Tirumala: తిరుమల వెంకన్నకు రూ. 1.75 కోట్ల విలువైన స్వర్ణ ఖడ్గం బహూకరణ!

  • తమిళ భక్తుని కానుక
  • తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
  • స్వామిని దర్శించుకున్న నటి శ్రీరెడ్డి

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని విలువైన ఆభరణాల్లో మరొకటి వచ్చి చేరింది. తమిళనాడు, తేని జిల్లాకు చెందిన తంగదొరై అనే భక్తుడు శ్రీవారికి రూ. 1.75 కోట్లు విలువ చేసే స్వర్ణ ఖడ్గాన్ని కానుకగా సమర్పించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన, స్వామివారికి కానుకను సమర్పించారు.  

కాగా, తిరుమలలో నేడు కూడా రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 25 గంటల సమయం పడుతుండగా, కాలి నడక భక్తులకు 10 గంటలు, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన వారికి ఆరు గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ విధానం కోరుకునే భక్తులకు 10 గంటల తరువాతనే దర్శనం చేసుకునే సమయాన్ని అధికారులు కేటాయిస్తున్నారు. ఈ ఉదయం నటి శ్రీరెడ్డి తిరుమలకు కాలినడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుంది.

Tirumala
Tirupati
TTD
Swarna Khadgam
Sri Reddy
  • Loading...

More Telugu News