abhishek: సుమలత తనయుడు హీరో అవుతున్నాడు!

  • సుమలత- అంబరీష్ తనయుడు అభిషేక్ 
  • నటనపట్ల ఆసక్తితో పూర్తి చేసిన కసరత్తులు
  • 'అమర్' సినిమాతో పరిచయానికి సన్నాహాలు

తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికలలో సుమలత స్థానం ప్రత్యేకమైనదని చెప్పాలి. ఇక ఆమె భర్త అంబరీష్ కన్నడ చిత్ర సీమలో రెబల్ స్టార్ అనే విషయం తెలిసిందే. వీరి వారసుడు అభిషేక్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది. అభిషేక్ ఆకట్టుకునే రూపంతో హీరో అనిపించేలానే ఉంటాడు. అందువలన స్నేహితులంతా ఆయనని ఆ దిశగా ప్రోత్సహించారట.

 యాక్టింగ్ వైపు ఆసక్తి వున్న అభిషేక్ ఇప్పటికే నటనలోను .. మార్షల్ ఆర్ట్స్ లోను ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. 'అమర్' అనే సినిమా ద్వారా అభిషేక్ పరిచయం కానున్నాడు. సందేశ్ నాగరాజ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, నాగ శేఖర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తాన్యా హోప్ ను తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అభిషేక్ తన పేరెంట్స్ మాదిరిగా వెండితెరపై తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి.    

abhishek
sumalata
  • Loading...

More Telugu News