charan: 'రంగస్థలం' క్లైమాక్స్ కాపీ కాదు: సుకుమార్

  • ఆ రచయితను ఎప్పుడూ చూడలేదు 
  • ఎక్కడా కలుసుకోనూ లేదు 
  • ఆయన చేసిన ఫిర్యాదులో నిజం లేదు

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా 'రంగస్థలం' నిలిచింది. చరణ్ .. సుకుమార్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఎం.గాంధీ అనే రచయిత ఈ క్లైమాక్స్ తాను రాసుకున్న ఒక కథలోనిదనీ, దానిని సుకుమార్ కాపీ కొట్టారని రచయితల సంఘానికి ఫిర్యాదు చేశాడు.

ఆయన ఎవరో తనకి గానీ .. తన నిర్మాతలకి గాని తెలియదనీ, ఎప్పుడూ ఎక్కడా కలుసుకోవడం కూడా జరగలేదని సుకుమార్ చెప్పారు. అందువలన కాపీ కొట్టారనే మాటలో అర్థమేలేదని అన్నారు. 'రంగస్థలం' సినిమా ముగింపు చాలా పాత సినిమాల్లో వున్నదేననీ .. దానిని తాను కొత్తగా రాసుకున్నానని చెప్పారు. ఆయన సమాధానంతో రచయితల సంఘం సంతృప్తి చెందింది. ఈ విషయంలో ఇంకా న్యాయపోరాటం చేయాలనుకుంటే న్యాయస్థానం ద్వారా ప్రయత్నించమని గాంధీకి సూచించింది.   

charan
samanta
  • Loading...

More Telugu News