Chandrababu: ఏపీకి శుభవార్త.. ‘పోలవరం’ నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • నిధుల విడుదలకు ఎంవోయూ కుదుర్చుకోవాలన్న నాబార్డ్
  • కొత్త ఎంవోఏకు ఆర్థిక శాఖ ఆమోదం
  • నిధుల విడుదలకు మార్గం సుగమం

ఏపీ ప్రభుత్వానికి ఇది ఊరటనిచ్చే అంశమే. ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు కేంద్ర ఆమోదం లభించింది. నాబార్డ్, కేంద్ర జల వనరుల శాఖ, జల వనరుల కమిషనర్, కేంద్ర ఆర్థిక శాఖ మధ్య కుదిరిన ఎంవోఏకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ఈ ఫైలు కేంద్ర జల వనరుల శాఖకు చేరింది.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలంటే కేంద్రం తమతో మళ్లీ ఎంవోఏ (మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాలని నాబార్డ్ గతంలో స్పష్టం చేసింది. ఫలితంగా కొత్త ఎంవోఏ సిద్ధమైంది. ఇప్పుడది ఆమోదం పొందడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అయితే, పోలవరం ప్రాజెక్టుకు గతేడాది చెల్లించాల్సిన రూ.1089 కోట్లను కేంద్రం ఇప్పటికైనా విడుదల చేస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News