Tamilnadu: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. శాశ్వతంగా మూతపడనున్న ‘స్టెరిలైట్’!

  • ‘స్టెరిలైట్’కు వ్యతిరేకంగా ప్రజలు చేసిన ఆందోళనకు ఫలితం
  • తమిళనాడు కేబినెట్ సమావేశం 
  • ఈ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయం

తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణను అడ్డుకోవడానికి అక్కడి ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న విషయం తెలిసిందే. గ్రామస్తుల ప్రాణాలను కబళిస్తున్న ఈ ప్లాంట్ ను మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టెరిలైట్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొద్ది సేపటి క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 కాగా, ఈ ప్లాంట్ కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు చనిపోవడం విదితమే. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి ఓ నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించిన తరుణంలో సీఎం పళనిస్వామి ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News