Telangana: టీడీపీ నుంచి మోత్కుపల్లి బహిష్కరణ

  • టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటన
  • మోత్కుపల్లి విపరీత ధోరణితో పార్టీపై విమర్శలు చేశారు
  • పార్టీని బలహీనపరిచే విధంగా మాట్లాడారు

టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులును పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఓ ప్రకటన చేశారు. విజయవాడలో జరుగుతున్న రెండో రోజు మహానాడు వేదికగా రమణ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, మోత్కుపల్లి విపరీత ధోరణితో పార్టీపై విమర్శలు చేశారని, ఆయన వ్యవహారం తార స్థాయికి చేరిందని, పార్టీని బలహీనపరిచే విధంగా ఆయన మాట్లాడారని మండిపడ్డారు.

తనకు గవర్నర్ పదవి రాలేదన్న అక్కసుతోనే విమర్శలు చేశారని ఆయన అన్నారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇవ్వాలని నాడు కేంద్రాన్ని చంద్రబాబు కోరారని, అందుకు కేంద్రం కూడా అంగీకరించిందని చెప్పారు. అయితే, తమిళనాడు గవర్నర్ గా తనను నియమించాలని మోత్కుపల్లి కోరారని, అందుకు కేంద్రం అంగీకరించలేదని రమణ చెప్పారు.

Telangana
Telugudesam
mothkpalli
  • Loading...

More Telugu News