motkupalli: జగన్, పవన్ ఒక్కటైతే.. టీడీపీకి డిపాజిట్లు కూడా రావు!: మోత్కుపల్లి

  • రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారు
  • తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు కుట్ర చేశారు
  • అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏపీలో రథయాత్ర చేస్తా

తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు రూటు మార్చారు. సొంత పార్టీపై, పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఏపీలో వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు చేతులు కలిపితే... తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్ర చేశారని... అయితే, కేసీఆర్ తెలివైనవాడు కావడంతో చంద్రబాబు ప్రయత్నాన్ని అడ్డుకోగలిగారని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏపీలో రథయాత్ర చేస్తానని తెలిపారు.

motkupalli
Chandrababu
Pawan Kalyan
jagan
ntr
kcr
  • Loading...

More Telugu News