balakrishna: సంక్రాంతికే ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్

  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు
  • దర్శకుడిగా రంగంలోకి క్రిష్ 
  • హిట్ కాంబినేషన్ పై అందరిలో ఆసక్తి

మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ వుంది. సాధ్యమైనంత వరకూ తన సినిమాలు సంక్రాంతికే విడుదలయ్యేలా ఆయన ప్లాన్ చేసుకుంటారు. అలా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సినిమాలు చాలా వరకూ విజయవిహారం చేశాయి. అందువలన తాను నటిస్తూ .. నిర్మిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ ని కూడా సంక్రాంతికే విడుదల చేయనున్నట్టు తాజాగా బాలకృష్ణ ప్రకటించారు.

ముందుగా ఈ సినిమాకి దర్శకుడిగా తేజను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడు. దాంతో ఆలోచనలో పడిన బాలకృష్ణ .. తనకి 'గౌతమీ పుత్ర శాతకర్ణి'తో భారీ సక్సెస్ ను ఇచ్చిన క్రిష్ ను దర్శకుడిగా ఎంచుకున్నారు. క్రిష్ ను దర్శకుడిగా ప్రకటించడంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' కూడా సంక్రాంతికే వచ్చి సంచలన విజయాన్ని సాధించింది. అలా 'ఎన్టీఆర్' మూవీ కూడా సంక్రాంతికే సందడి చేయనుందన్న మాట.  

balakrishna
krish
  • Loading...

More Telugu News