mahanadu: ఆరు సంవత్సరాలు మహానాడు జరగలేదు.. టీడీపీ పండుగ గురించి మరిన్ని విశేషాలు!

  • హైదరాబాదులో అత్యధికంగా 16 సార్లు మహానాడు కార్యక్రమం
  • ఎన్టీఆర్ పుట్టినరోజుతో సంబంధం లేకుండా ఒకసారి నిర్వహణ
  • 1998లో ఏడు రోజుల పాటు జరిగిన టీడీపీ పండుగ

ఎన్టీఆర్ జయంతిని మహానాడు పేరుతో ఒక పండుగలా జరుపుకోవడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయతీగా వస్తోంది. నిన్న విజయవాడలో ప్రారంభమైన మహానాడు అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహానాడుకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

టీడీపీని స్థాపించిన తర్వాత తన పుట్టిన రోజును పురస్కరించుకుని తిరుపతిలోని త్యాగరాయ మండపంలో 1982 మే 27, 28 తేదీలతో దివంగత ఎన్టీఆర్ భారీ సభను నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమాన్ని మహానాడుగా పరిగణించకపోయినా... ఎన్టీఆర్ పుట్టిన రోజును మహానాడుగా జరుపుకునే సంప్రదాయం ఆ వేడుకలతోనే ప్రారంభమైంది. మొదట్లో రెండు రోజుల పాటు జరిగిన మహానాడును...  ఆ తర్వాత మూడు రోజులకు పొడిగించారు. 1998లో మాత్రం విజయవాడలో మే 23 నుంచి 29 వరకు ఏకంగా ఏడు రోజుల పాటు నిర్వహించారు. ఆ నాటి మహానాడు పూర్తి గ్రామీణ వాతావరణంలో, గ్రామీణ క్రీడల పోటీలతో జరిగింది.

శాసనసభ రద్దు, ఎన్నికలు తదితర కారణాలతో 1985, 1989, 1995, 1996, 1997 సంవత్సరాల్లో మహానాడును నిర్వహించలేదు. 2008లో చంద్రబాబు చేపట్టిన మీకోసం పాదయాత్ర నేపథ్యంలో మరోసారి మహానాడు జరగలేదు.

మహానాడు కార్యక్రమం హైదరాబాదులో అత్యధికంగా 16 సార్లు జరిగింది. 1993, 1999, 2004లలో కేవలం ఒక్కరోజు మాత్రమే మహానాడు జరిగింది. సాధారణంగా ఎన్టీఆర్ పుట్టినరోజును కలుపుకుని జరిగే మహానాడు... 1986లో మాత్రం జనవరి 4, 5, 6 తేదీలలో హైదరాబాదులోని గండిపేటలో జరిగింది. 

  • Loading...

More Telugu News