kumaraswamy: కుమారస్వామికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీస్తాం: శ్రీరాములు

  • రైతు రుణమాఫీ చేస్తామని కుమారస్వామి ప్రకటించారు
  • ఇప్పుడు ఎగవేత ధోరణిలో ఉన్నారు
  • ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందే

24 గంటల్లో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పుడు రుణమాఫీపై ఎగవేత ధోరణిని అవలంబిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే, గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు మండిపడ్డారు. కుమారస్వామి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని అన్నారు. రుణమాఫీ చేస్తామంటూ స్పష్టమైన ప్రకటన చేసిన ప్రభుత్వం... హామీని నిలుపుకోవాల్సిందేనని చెప్పారు. ప్రభుత్వం మాట తప్పితే... రైతులతో కలిసి, ఉద్యమాన్ని లేవదీస్తామని హెచ్చరించారు. బళ్లారిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

kumaraswamy
sriramulu
ballary
  • Loading...

More Telugu News