Rahul Gandhi: నన్ను విమర్శించేందుకు కష్టపడొద్దు.. త్వరలోనే తిరిగొస్తా: రాహుల్ గాంధీ

  • అమ్మను వైద్యపరీక్షల కోసం విదేశాలకు తీసుకెళుతున్నా
  • త్వరలోనే తిరిగి వస్తా
  • అమ్మ సెంటిమెంట్ తో కొట్టిన రాహుల్

బీజేపీ నాయకత్వానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చురక అంటించారు. అమ్మను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్నానని... కాబట్టి కొన్ని రోజులు అందుబాటులో ఉండనని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ట్రోలింగ్ ఆర్మీకి ఒక విన్నపం చేస్తున్నానని... తనను విమర్శించడానికి ఎక్కువగా కష్టపడవద్దని, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఒకటి రెండు రోజుల్లో తల్లి సోనియాను తీసుకుని రాహుల్ విదేశాలకు వెళుతున్నారని కాంగ్రెస్ వర్గాలు కూడా తెలిపాయి. కర్ణాటకలో కేబినెట్ విస్తరణకు సంబంధించి రాహుల్ ఇప్పటికే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని... విదేశాల నుంచి తిరిగి వచ్చాక, మధ్యప్రదేశ్ లో ఆయన పర్యటిస్తారని ప్రకటించాయి.

మరోవైపు, చెప్పాపెట్టకుండా రాహుల్ గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు బీజేపీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే విదేశాలకు వెళ్లి, రోజులకురోజులు గడపడం రాహుల్ కు అలవాటంటూ బీజేపీ శ్రేణులు విమర్శించాయి. గత అనుభవాల కారణంగా... ఈసారి రాహుల్ ముందుగానే అందరికీ సమాచారాన్ని వెల్లడించారు. అమ్మ సెంటిమెంట్ తో కొట్టారు. 

Rahul Gandhi
Sonia Gandhi
medical treatment
  • Error fetching data: Network response was not ok

More Telugu News