keerti suresh: ఓవర్సీస్ లో కొత్త రికార్డుల దిశగా వెళుతోన్న 'మహానటి'

- దూసుకుపోతోన్న 'మహానటి'
- ఏ ప్రాంతంలోనూ తగ్గని ఆదరణ
- కొత్త రికార్డుల దిశగా పరుగులు
ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మహానటి' తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 10 చిత్రాల జాబితాలో 'మహానటి' 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది. సావిత్రికి గల క్రేజ్ .. ఆమె జీవితం విషాదాంతం కావడానికి గల కారణాలను తెలుసుకోవాలనే అభిమానుల ఆసక్తి ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టింది.
