Tamannaah: 'సైరా' కోసం భరతనాట్యం నేర్చుకుంటోన్న తమన్నా

  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
  • చిరంజీవి సరసన నయనతార 
  • కొత్త లుక్ తో కనిపించనున్న తమన్నా

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' సినిమా రూపొందుతోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా కావడం వలన .. వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన ఉండటం వలన, నటీనటుల ఎంపిక విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్ర కోసం తమన్నాను తీసుకున్నారు.

 ఈ సినిమాలో ఆమె 'నరసింహారెడ్డి' కోసం ప్రాణత్యాగం చేసే వీరనారిగా కనిపించనుందనే ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం కొంతకాలంగా ఆమె 'భరత నాట్యం' నేర్చుకుంటోందనేది తాజా సమాచారం. ఒక వైపున 'వీరనారి' అనే ప్రచారం .. మరో వైపున 'భరతనాట్యం' నేర్చుకుంటోందనే వార్త .. దాంతో ఆమె పాత్ర విషయంలో మరింత ఆసక్తి పెరుగుతోంది. కథలో ఆమె పాత్ర .. ఆ పాత్ర చూపించే ప్రభావం ఎలా ఉండనుందనే విషయం గురించే ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి 'సైరా'లో తమన్నా కొత్తగా కనిపించనుందన్న మాట.  

Tamannaah
nayanatara
  • Loading...

More Telugu News