Krish: భయంగా ఉన్నా, నాకు దక్కిన మహాభాగ్యమిది: దర్శకుడు క్రిష్
- చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాను
- 'ఎన్టీఆర్'కు దర్శకత్వం వహించాలని బాలయ్య కోరితే భయపడ్డా
- తెలుగుజాతికి ఓ దృశ్యకావ్యాన్ని అందిస్తానన్న క్రిష్
చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు, ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీసే అవకాశం లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదని దర్శకుడు క్రిష్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించిన క్రిష్, మీడియాతో మాట్లాడారు.
'ఎన్టీఆర్' బయోపిక్ కు దర్శకత్వం చేయాలని బాలయ్య అడిగినప్పుడు భయపడ్డానని, ఆ తరువాత, ఇది తనకు దక్కిన మహాభాగ్యంగా అనిపించిందని అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను దృశ్యకావ్యం రూపంలో తెలుగుజాతికి అందించే అవకాశాన్ని తనకు కల్పించిన బాలకృష్ణకు కృతజ్ఞతలని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తని, తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు.