Summer: అబ్బో! చాలా వేడిగా ఉంది.. వేసవి సెలవులు పొడిగించండి: తల్లిదండ్రుల వేడుకోలు

  • ఇంత వేడిలో స్కూళ్లు తెరవడం మంచిది కాదు
  • మరో 15 రోజులు వాయిదా వేయండి
  • ప్రభుత్వానికి తల్లిదండ్రులు వినతి

మరో నాలుగు రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న వేళ తల్లిదండ్రుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని డిమాండ్ ఎదురైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో వేసవి సెలవులను మరో 15 రోజులు పొడిగించాలని వేడుకుంటున్నారు. ఈ ఉష్ణోగ్రతల్లో తరగతులను నిర్వహించడం సరికాదని, దీనివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తల్లిదండ్రులు, చిన్నారుల హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. జూన్ 1న ప్రారంభం కావాల్సిన స్కూళ్లను మరో 15 రోజులు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి ఉండడంతో జూన్ 12 లేదంటే 15న స్కూళ్లను తెరవడమే మంచిదని పేర్కొన్నారు. అంతగా అవసరం అనుకుంటే జూన్ 2న జరిగే రాష్ట్రావతరణ వేడుకలకు ఆసక్తి ఉన్న విద్యార్థులను హాజరుకావాల్సిందిగా కోరి వేడుకలు నిర్వహిస్తే సరిపోతుందన్నారు. కొందరు తల్లిదండ్రులైతే కనీసం జూన్ మధ్య వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News