sidheer babu: సొంత బ్యానర్ ను స్థాపించిన సుధీర్ బాబు .. తనే హీరోగా తొలి సినిమా!

  • హీరోగా రాణిస్తోన్న సుధీర్ బాబు 
  • నిర్మాణ రంగంపై దృష్టి
  • ఇతర హీరోలతోను సినిమాలు      

మొదటి నుంచి కూడా సుధీర్ బాబు వైవిధ్యభరితమైన కథలను .. కొత్తదనంతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా హీరోగా ఆయన మంచి మార్కులు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన సినిమా నిర్మాణ రంగంపైనా దృష్టి పెట్టాడు. ఎస్.బి. పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో నిన్న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సంస్థకి సంబంధించిన 'లోగో'ను అల్లు అరవింద్ .. వీడియోను దిల్ రాజు విడుదల చేశారు.

నిర్మాతగా మారాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సుధీర్ బాబును అల్లు అరవింద్ అభినందించారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ ను సాధించాలని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. ఇక తన సొంత బ్యానర్ పై తొలి సినిమాను తానే చేస్తున్నట్టుగా సుధీర్ బాబు చెప్పాడు. ఇతర హీరోలతోను ఈ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తానని ఆయన అన్నాడు. శివలెంక కృష్ణ ప్రసాద్ .. లగడపాటి శ్రీధర్ .. వంశీ పైడిపల్లి .. శ్రీరామ్ ఆదిత్య .. వెంకీ అట్లూరి .. ప్రవీణ్ సత్తారు .. శివ నిర్వాణ .. సందీప్ కిషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

sidheer babu
allu aravind
dil raju
  • Loading...

More Telugu News