Konathala Ramakrishna: కొణతాలకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఆఫర్.. పార్టీలోకి తిరిగి తీసుకొచ్చేందుకు వైసీపీ యత్నం!

  • కొణతాల కోసం రాయబారం
  • ఎంపీ టికెట్, ఆర్థిక సాయానికి వైసీపీ రెడీ
  • కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ పదవి ఆఫర్
  • ఎటూ తేల్చుకోలేకపోతున్న కొణతాల

మాజీ మంత్రి, వైసీపీ మాజీ నేత కొణతాల రామకృష్ణను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ అధిష్ఠానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొణతాలను తిరిగి పార్టీలోకి తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్న వైసీపీ, ఆయన కోసం కన్నబాబురాజును రంగంలోకి దింపింది. ఇప్పటికే మూడుసార్లు కొణతాలను కలిసి కన్నబాబు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

అనకాపల్లి లోక్‌సభ టికెట్‌తోపాటు, పోటీ కోసం ఆర్థికంగానూ సాయం అందిస్తామని అధిష్ఠానం ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. విజయసాయిరెడ్డి, విజయలక్ష్మి కూడా కొణతాలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి ఆహ్వానించినట్టు చెబుతున్నారు. అయితే, కొణతాల మాత్రం తొందరపడకుండా త్వరలోనే తన నిర్ణయాన్ని చెబుతానని వారికి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. తిరిగి పార్టీలోకి వస్తే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆఫర్ వచ్చినట్టు తెలిసింది. ఈ కారణంగానే ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు.

Konathala Ramakrishna
Visakhapatnam
YSRCP
Congress
  • Loading...

More Telugu News