NTR: ‘ఎన్.టి.ఆర్’ బయోపిక్ కు దర్శకుడిగా క్రిష్ ను తీసుకున్నా!: నందమూరి బాలకృష్ణ

  • నా నూరవ చిత్రాన్ని చరితగా మలిచిన దర్శకుడు క్రిష్  
  • ‘ఎన్.టి.ఆర్’కు చిత్ర రూపాన్ని ఇచ్చేది కూడా ఆయనే
  • ఈ విషయాన్ని ఆనందంతో తెలియజేస్తున్నా
  • మా కలయికలో ఇది రెండో దృశ్య కావ్యం

ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్.టి.ఆర్’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన తేజ ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడం విదితమే. ఈ క్రమంలో ‘ఎన్.టి.ఆర్’ చిత్రానికి తదుపరి దర్శకుడు ఎవరనే విషయమై తలెత్తిన వదంతులకు నందమూరి బాలకృష్ణ ఫుల్ స్టాప్ పెట్టారు.

తన వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి దర్శకత్వం వహించిన క్రిష్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. అంతేకాకుండా, ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.‘జనని భారత మెచ్చజగతి హారతులెత్త జనశ్రేణి ఘనంగా దీవించి నడుపగా రణభేరి మ్రోగించే తెలుగోడు జయగీతి నినదించె మొనగాడు.. ‘ఎన్.టి.ఆర్’ ..అంటూ ఈ వీడియోలో బాలకృష్ణ వాయిస్ ఓవర్ చెప్పారు. 
‘నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెబుతున్నాం. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది. ప్రతి ప్రాణానికి ఒక కథ ఉంటుంది. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది! నా నూరవ చిత్రాన్ని చరితగా మలిచిన క్రిష్ జాగర్లమూడి.. ఈ చరిత్రకు చిత్ర రూపాన్ని ఇస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నా. ఇది, మా కలయికలో రెండో దృశ్య కావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణ. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది.. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది. ప్రతి నిమిషం మీ కుశలాలు కాంక్షించే..మీ నందమూరి బాలకృష్ణ’ అని ఈ వీడియోలో బాలయ్య పేర్కొన్నారు.

NTR
Balakrishna
krish
  • Error fetching data: Network response was not ok

More Telugu News