Hyderabad: బండారు దత్తాత్రేయను పరామర్శించిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

  • హైదరాబాద్ లో దత్తాత్రేయ నివాసానికి వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి
  • వైష్ణవ్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన మాజీ సీఎం
  • దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చిన వైనం

తన కుమారుడు వైష్ణవ్ మృతితో తీరని ఆవేదనలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. సికింద్రాబాద్ లోని రామ్ నగర్ లో దత్తాత్రేయ నివాసానికి ఈరోజు ఆయన వెళ్లారు. వైష్ణవ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చిన కిరణ్ కుమార్ రెడ్డి వారికి తన సానుభూతి తెలిపారు. చాలా చిన్న వయస్సులోనే వైష్ణవ్ మృతి చెందడం బాధాకరమని కిరణ్ కుమార్ రెడ్డి వాపోయారు.

Hyderabad
bandaru
ex cm kirankumar
  • Loading...

More Telugu News