Vijayawada: ఒకప్పటిలా పార్టీ కార్యకర్తలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నా: సీఎం చంద్రబాబు

  • రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నా
  • వచ్చే ఎన్నికల్లో  25 లోక్ సభ స్థానాల్లో టీడీపీ గెలవాలి
  • రాబోయే రోజుల్లో టీడీపీదే విజయం
  • డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్న సైన్యం మనది

ఒకప్పటిలా పార్టీ కార్యకర్తలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో ‘మహానాడు’ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 25 లోక్ సభ స్థానాల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు, రాబోయే రోజుల్లో టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

నవ్యాంధ్రను బాగు చేసే శక్తి టీడీపీకి ఉందని చెప్పే ప్రజలు మనకు అవకాశమిచ్చారని, డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్న సైన్యం తమదని, ఏపీలో 60 లక్షలు, తెలంగాణలో 10 లక్షలమంది శిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారని అన్నారు. విదేశాల్లో కూడా మన వాళ్లు మహానాడు జరుపుకుంటున్నారని, కార్యకర్తల కష్టం, త్యాగాల పునాదిపైనే పార్టీ నిలబడి ఉందని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దామని, మన ప్రభుత్వం వచ్చాకే సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయగలిగామని చెప్పారు.

Vijayawada
mahanadu
Chandrababu
  • Loading...

More Telugu News