Trivikram Srinivas: 'అజ్ఞాతవాసి'లో పెడితే అలాంటి కీర్తన వర్కవుట్ కాలేదు... 'అరవింద సమేత'లో ఉండదు: త్రివిక్రమ్ శ్రీనివాస్

  • కొత్త సినిమాలో శాస్త్రీయ గీతం ఉండదు
  • అపజయాలు వస్తే కుంగిపోయే వ్యక్తిని కాదు
  • ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే, అందులో ఓ శాస్త్రీయ కీర్తన ఉంటుంది. సందర్భానికి తగ్గట్టుగా దాన్ని వాడుకుంటారాయన. 'అజ్ఞాతవాసి' చిత్రంలో "మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా" అన్న పాట వినిపిస్తుంది. ఇక ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, అటువంటి కీర్తన ఏదీ తన తాజా చిత్రం, ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'అరవింద సమేత'లో ఉండదని స్పష్టం చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

'అజ్ఞాతవాసి'లో అటువంటి పాట పెడితే వర్కవుట్ కాలేదని గుర్తు చేస్తూ, అటువంటి పాట కొత్త సినిమా స్క్రిప్ట్ లో లేదని చెప్పారు. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోయే వ్యక్తిని తాను కానని, విజయం సాధించినా, సినిమా పోయినా మామూలుగానే ఉంటానని చెప్పారు. అపజయం ఎదురైనప్పుడు మరింతగా పనిచేస్తే బయటపడవచ్చని, తానిప్పుడు అదే పని చేస్తున్నానని అన్నారు.

Trivikram Srinivas
Agnatawasi
Aravinda Sameta
  • Loading...

More Telugu News