Madala Rangarao: మాదాల రంగారావు మృతిపై స్పందించిన చంద్రబాబు!

  • మాదాల ఆత్మకు శాంతి కలగాలి
  • మరో తార రాలిపోయింది
  • సంతాపం తెలిపిన చంద్రబాబు

రెడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు మాదాల రంగారావు మృతిపై స్పందించిన చంద్రబాబు, ఆయన మరణవార్త విని తాను దిగ్భ్రాంతి చెందానని వ్యాఖ్యానించారు. మాదాల మృతికి సంతాపం తెలిపిన ఆయన, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. సమాజంలోని అవినీతి, అక్రమాలపై ఆయన సినీ మాధ్యమంగా పోరాడి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని గుర్తు చేశారు. రాజకీయ, సామాజిక రంగాల్లోని చీకటి కోణాలను మాదాల తన చిత్రాల ద్వారా వెలుగులోకి తెచ్చి ఎండగట్టారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరో తార రాలిపోయిందని, మాదాల చిత్రాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.

Madala Rangarao
Chandrababu
Died
Condolences
  • Loading...

More Telugu News