Andhra Pradesh: సింహం సింగిల్ గానే వస్తుంది: బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు

  • వచ్చే సంవత్సరం ఎవరితోనూ పొత్తుండదు
  • ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తాం
  • మహానాడు సందర్భంగా బుద్ధా వెంకన్న

వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోరుకు సన్నద్ధమవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మహానాడు వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మహానాడు నుంచే తమ పార్టీ అధినేత ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ విజయం ఖాయమని, సింహం సింగిల్ గానే వస్తుందని అన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh
Assembly Elections
Buddha venkanna
Chandrababu
  • Loading...

More Telugu News