Sonam Kapoor: మంగళసూత్రాన్ని బ్రేస్ లెట్ గా మార్చేసుకున్న హీరోయిన్ సోనమ్ కపూర్

  • ఈనెల 8న సోనమ్ వివాహం
  • ఆ వెంటనే కేన్స్ చిత్రోత్సవాలకు పయనం
  • మంగళసూత్రాన్ని బ్రేస్ లెట్ గా మార్చుకున్న సోనమ్

ఆనంద్ ఎస్ అహూజాతో నాలుగేళ్ల తన ప్రేమను వైవాహిక బంధంతో ఒకటి చేసుకుని, ఆ వెంటనే తాను నటిస్తున్న సినిమాల షూటింగ్ ను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగిన అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ మిగతా హీరోయిన్లతో పోలిస్తే భిన్నంగా కనిపిస్తోంది. పెళ్లి చేసుకున్న హీరోయిన్లు తమ మంగళసూత్రాన్ని మెడలో ధరించి కనిపించడం చాలా అరుదు. కానీ, సోనమ్ మాత్రం మాంగల్యాన్ని అనునిత్యం శరీరంపై ఉంచుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ జంటకు 8వ తేదీన వివాహం కాగా, ఆపై కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు బయలుదేరిన సోనమ్, తన మంగళసూత్రాన్ని చేతికి బ్రేస్ లెట్ మాదిరి డిజైన్ చేయించుకుంది. ఈ మంగళసూత్రంపై తామిద్దరి రాశులైన లియో, జెమినీ చిహ్నాలను కూడా సోనమ్ డిజైన్ చేయించుకుంది. భర్తపై తనకున్న ప్రేమను సోనమ్ ఇలా వెల్లడిస్తోందన్న కామెంట్లు వస్తున్నాయి.

Sonam Kapoor
Anand Ahuza
Mangala Sutram
Bracelet
  • Loading...

More Telugu News