NDA]: చంద్రబాబు వైఖరి కచ్చితంగా ఆత్మహత్యా సదృశమే!: బీజేపీ నేత రాం మాధవ్

  • ఎన్డీయే నుంచి విడిపోయి తప్పు చేశారు
  • మోదీని చూసే ఏపీలో టీడీపీకి ఓట్లు
  • రాష్ట్రానికి ఎంతో చేశామన్న రాం మాధవ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఎన్టీఏ నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయం, ఆత్మహత్యతో సమానమని బీజేపీ నేత రాం మాధవ్ వ్యాఖ్యానించారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబువన్నీ కాంగ్రెస్ బుద్ధులేనని విమర్శలు గుప్పించారు.

బీజేపీ నేత నరేంద్ర మోదీని చూసి ఏపీ ప్రజలు చంద్రబాబుకు ఓటేశారని, ఇప్పుడు ప్రజా తీర్పును ఆయన పక్కనబెట్టి, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో చేసిందన్న రాం మాధవ్, వాటిని చంద్రబాబు మరచిపోయారని అన్నారు.

NDA]
BJP
Telugudesam
Chandrababu
Rammadhav
  • Loading...

More Telugu News