Kajaluru: ఆగట్టునుంటావా?... విద్యార్థి, ఈగట్టు కొస్తావా?: ఆకర్షిస్తున్న ప్రభుత్వ పాఠశాల పోస్టర్!

  • క్రమశిక్షణ, నైతికి విలువలకు ప్రభుత్వ పాఠశాలలే మార్గం
  • 'రంగస్థలం' సాంగ్ ను ప్రస్తావిస్తూ పోస్టర్
  • ఆకర్షిస్తున్న కాజలూరు ఎంపీపీపీ స్కూల్ ప్లెక్సీ

క్రమశిక్షణ, నైతిక విలువలకు, సరైన శిక్షణకు ప్రభుత్వ పాఠశాలలే మార్గమని చెబుతూ, తూ.గో.జిల్లా కాజలూరు శ్రీరామనగర్ కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, స్కూల్ అడ్మిషన్లు మొదలైనాయని చెబుతూ, గోడకు పెట్టిన ఓ పోస్టర్ ఇప్పుడందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల విడుదలైన 'రంగస్థలం' చిత్రంలోని హిట్ పాటను పోలేలా "ఆగట్టునుంటావా... విద్యార్థి ఈగట్టు కొస్తావా?" అంటూ టైటిల్ పెట్టి, "ఆ గట్టునేమో ఇరవై వేల ఖర్చు ఉంది. ఈ గట్టునేమో నాణ్యమైన చదువుంది" అంటూ ఫీజులను పోల్చుతూ ఈ పోస్టర్ ఉంది.

ప్రైవేటు స్కూళ్లలో స్కూల్ ఫీజు 5 వేలు, స్కూల్ బ్యాగ్ 500, టెక్ట్స్ బుక్స్ 1000, నోట్ బుక్స్ 500, లంచ్ బాక్స్ 5 వేలు, యూనిఫాం 1000, బస్సు లేదా ఆటోకు 2 వేలు, ఇతర ఖర్చులు 5 వేలు ఉంటాయని చెబుతూ, స్కూల్ ఫీజు, బ్యాగ్, బుక్స్, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, కంప్యూటర్ విద్య తదితరాలన్నీ తాము ఉచితంగా ఇస్తామని ప్రభుత్వ పాఠశాల ఈ ప్లెక్సీలో రాసింది. ఆ ప్లెక్సీని మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News