Karnataka: ఊటీలో ఘోరం... 500 అడుగుల లోయలో పడ్డ కర్ణాటక టూరిస్టు బస్సు!

  • ఆరుగురు అక్కడికక్కడే మృతి
  • మరో 20 మందికి తీవ్ర గాయాలు
  • సహాయక చర్యలు ప్రారంభం

ఊటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేసవి వేడిమి నుంచి కాస్తంత సేదదీరాలన్న ఉద్దేశంతో హిల్ స్టేషన్ కు బయలుదేరిన ఓ టూరిస్టు బస్సు 500 అడుగుల లోయలో పడిపోయింది. కర్ణాటకకు చెందిన బస్సు ఊటీకి సమీపంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తూ లోయలో పడిపోగా, ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది.

బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉండగా, 20 మందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Karnataka
Ooti
Road Accident
Tourist Bus
  • Loading...

More Telugu News