Bollywood: అలనాటి బాలీవుడ్ నటి గీతాకపూర్ కన్నుమూత.. ఏడాది పాటు వృద్ధాశ్రమంలోనే ఉన్న వైనం

- ఏడాది నుంచి పిల్లల కోసం ఎదురు చూపులు
- మరో రెండు రోజుల పాటు భౌతిక కాయం ఆసుపత్రిలో..
- పిల్లలు వచ్చి చూస్తారని ఆశిస్తున్నామన్న నిర్మాత అశోక్ పండిత్
అలనాటి బాలీవుడ్ నటి గీతా కపూర్ అనారోగ్యంతో బాధపడుతూ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారని సీబీఎఫ్‌సీ సభ్యుడు, నిర్మాత అశోక్ పండిత్ ప్రకటించారు. ఏడాది నుంచి వృద్ధాశ్రమంలో ఉంటోన్న ఆమె తన పిల్లల కోసం ఎదురుచూస్తూ చివరకు వారిని చూడకుండానే కన్నుమూశారని తెలిపారు. గీతా కపూర్ పార్ధివ దేహాన్ని ముంబయిలోని విలే పర్లీలోని కూపర్ హాస్పిటల్‌లో రెండు రోజుల పాటు ఉంచుతామని, ఆమె పిల్లలు తమ తల్లిని చివరిసారి చూసుకుని అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ఒకవేళ గీతా కపూర్ పిల్లలు రాకపోతే తామే అంతిమ సంస్కారాలను నిర్వహిస్తామని తెలిపారు.
