butta renuka: ఎమ్మెల్యేగా కాదు... టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తా: బుట్టా రేణుక

  • ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేయను
  • కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తా
  • ఎమ్మిగనూరులో స్పష్టం చేసిన బుట్టా రేణుక

రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కొట్టిపారేశారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం లేదని చెప్పారు. టీడీపీ తరపున కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తానని తెలిపారు. ఎమ్మిగనూరులో రూ. 9.78 లక్షలతో నిర్మించిన నీటి ట్యాంకును ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా ఆమె గెలుపొందారు. ఆ తర్వాత ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.  

butta renuka
kurnool
yemmiganur
mp
mla
  • Loading...

More Telugu News