Pawan Kalyan: రాజకీయాల్లోకి హ్యూమన్ యాంగిల్ ను తీసుకొస్తా: పవన్ కల్యాణ్

  • మానవతా దృక్పథం లోపించింది
  • మహిళల ఆరోగ్యానికి భద్రత కల్పించే బాధ్యత నాదే
  • మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత వైద్యం ఉంటుంది

రాజకీయాల్లో మానవతా దృక్పథం లోపించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హ్యూమన్ యాంగిల్ ను రాజకీయాల్లోకి తాను మళ్లీ తీసుకొస్తానని చెప్పారు. మహిళల ఆరోగ్యానికి భద్రత కల్పించే బాధ్యత తనదని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే... దేశాన్ని వాళ్లే బాగా చూసుకుంటారని చెప్పారు.

జనసేన మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత వైద్యం కూడా ఉంటుందని అన్నారు. డాక్టర్ శ్రీధర్ ఇచ్చిన సలహాలు, సూచనలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పవన్ నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆయన చేపట్టిన 24 గంటల దీక్ష సాయంత్రం 5 గంటలకు ముగుస్తోంది. 

Pawan Kalyan
janasena
women
health
  • Loading...

More Telugu News