Tollywood: ఏదో ఒక అబద్ధం చెప్పి ‘పుల్ అప్’ చేయకుండా తప్పించుకునేదాన్ని: నటి సమంత
- ‘పుల్ అప్’ చేయమని చాలా ఏళ్లుగా నా ట్రైనర్ చెప్పేవారు
- తలనొప్పిగా ఉందని, కడుపునొప్పిగా ఉందంటూ చేసే దాన్ని కాదు
- అయితే, ఎట్టకేలకు, ‘పుల్ అప్’ కు ప్రయత్నించా
‘హమ్ ఫిట్ తోహి ఇండియా ఫిట్’ పేరిట తన భర్త, హీరో నాగచైతన్య తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి.. తన భార్య సమంత, సుశాంత్, నిధి అగర్వాల్ కు సవాల్ విసిరాడు. ఈ సవాల్ కు సమంత స్పందించింది. ‘పుల్ అప్’ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
‘‘పుల్ అప్’ చేయమని చాలా ఏళ్లుగా నా ట్రైనర్ నాకు చెబుతుండేవారు. కానీ, నాకు తలనొప్పిగా ఉందని, కడుపునొప్పిగా ఉందని, పన్ను నొప్పిగా ఉందంటూ అబద్ధాలు చెప్పి తప్పించుకునే దానిని. ఎట్టకేలకు, పుల్ అప్ చేసేందుకు ప్రయత్నించానని చెబుతున్నందుకు సంతోషంగా ఉంది.. నా దృష్టిలో ఫిట్ నెస్ అనేది అందంగా కనిపించేందుకు కాదు.. క్రమశిక్షణ, గౌరవం, విశ్వాసం, శక్తి సామర్థ్యాల కోసం’ అని పేర్కొంది.
ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల, శిల్పారెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ లకు సవాల్ విసురుతున్నానని చెప్పింది. కాగా, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీలకు ‘హమ్ ఫిట్ తోహి ఇండియా ఫిట్’ పేరిట కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాల్ ను స్వీకరిస్తూ తాము కసరత్తు చేస్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేయడం తెలిసిందే.